విడవలూరు: మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం వద్ద సముద్రంలోకి ఆలివ్‌రిడ్లీ తాబేలు పిల్లలను సోమవారం విడిచి పెట్టారు. స్రౌత్ కోస్టల్ సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైరెన్ పోలీసులు ట్రీ ఫౌండేషన్ సహకారంతో సుమారు 80 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి మైరెన్ పోలీస్ స్టేషన్ సీఐ శేషయ్య మాట్లాడుతూ సముద్రంలో జీవవైవిధ్యం కోసం అంతరించిపోతున్న ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం నరేష్ మాట్లాడుతూ ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే విధానం, పొదిగే ప్రక్రియ, పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తీరప్రాంత మత్యకారులు తాబేళ్లను సంరక్షించాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, పీసీలు వినోద్, కృష్ణ, తాబేలు సంరక్షణ వాచర్లు, స్ధానికులు తదితరులు పాల్గొన్నారు.


