ప్రభుత్వ భూముల ఆక్రమణపై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూముల ఆక్రమణపై కన్నెర్ర

Mar 3 2026 7:24 AM | Updated on Mar 3 2026 7:24 AM

మర్రిపాడు: మండలంలోని చుంచులూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 484లో ఉన్న 77 ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లపై నమోదు చేసి క్రయవిక్రయాలు జరిపిన ఘటనపై సోమవారం గ్రామంలో భూమిలేని నిరుపేదలు ఆందోళన చేపట్టారు. చుంచులూరు గ్రామ సర్పంచ్‌ చిలపోగు చామంచయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్‌ మండలాధ్యక్షుడు బోటిక శ్రీనివాసులు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయించడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. పేదలకు చెందాల్సిన భూములను బినామీ పేర్లతో నమోదు చేసి రూ.కోట్లకు అమ్మకాలు జరపడం సరికాదన్నారు. మండలానికి చెందిన వారు కాదన్నారు. దొంగ పట్టాలు సృష్టించి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుని భూములను కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రెవెన్యూ పరిధిలో 618 రేషన్‌ కార్డులుండగా, 4 వేల ఎకరాల భూమి ఉందన్నారు. కుటుంబానికి 5 ఎకరాల చొప్పున పంచినా మిగులు భూమి ఉంటుందన్నారు. చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement