● డ్వామా పీడీ గంగాభవాని
నెల్లూరు(పొగతోట): ఎండలు పేరుగుతున్నందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో శ్రామికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డ్వామా పీడీ గంగాభవాని మండలాధికారులను ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, ఉపాధి సిబ్బందితో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. పని ప్రదేశాల్లో శ్రామికుల కోసం చలువ పందిళ్లు వేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలన్నారు. జాబ్‌కార్డులు కలిగిన శ్రామికులకు ఈ–కేవైసీ చేయాలని, 30 శాతం ఈ–కేవైసీ పెండింగ్ ఉందని త్వరగా వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. నూతన పద్ధతిలో ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలన్నారు. ఉదయం 7.30 గంటల్లోపు ఎన్‌ఎంఎంఎస్‌లో పనులకు హాజరైన శ్రామికుల ఫొటోలు అప్‌లోడ్ చేయాలన్నారు. ఫొటోలను అప్‌లోడ్ చేసే సమయంలో తేడాలు జరిగితే పేమెంట్లు మంజూరు కావన్నారు.


