ఆ టైమ్‌లో నాకు ప్రభాస్‌ ఒక్కడే సపోర్ట్‌గా నిలిచాడు: మారుతి | Director Maruthi Interesting Comments On Prabhas At The Raja Saab Teaser Launch Event | Sakshi
Sakshi News home page

ఆ టైమ్‌లో నాకు ప్రభాస్‌ ఒక్కడే సపోర్ట్‌గా నిలిచాడు: మారుతి

Jun 17 2025 10:53 AM | Updated on Jun 17 2025 11:09 AM

Director Maruthi Interesting Comments On Prabhas At The Raja Saab Teaser Launch Event

‘‘నేను దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్‌’ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. దీంతో మా కాంబినేషన్‌లో(ప్రభాస్‌–మారుతి) మూవీ అనుకున్న ప్రొడ్యూసర్‌ డ్రాప్‌ అయ్యారు. కానీ, అలాంటి టైమ్‌లో నాకు సపోర్ట్‌గా నిలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రభాస్‌గారు. అందుకే ‘ది రాజా సాబ్‌’ ను ఒక సవాల్‌గా తీసుకుని సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని డైరెక్టర్‌ మారుతి తెలిపారు. 

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న విడుదలకానుంది. 

(చదవండి: 'ఓ నిర్మాత నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశారు'.. ఎస్‌కేఎన్ కామెంట్స్ వైరల్!)

హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ–‘‘ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడు’ సినిమా స్టైల్‌లో ‘ది రాజా సాబ్‌’ ద్వారా వింటేజ్‌ లుక్‌లో చూపిస్తున్నాం. కొంత షూటింగ్, సాంగ్స్‌ బ్యాలెన్స్‌ ఉన్నాయి’’ అన్నారు.

 టీజీ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్‌ ఇండోర్‌ సెట్‌ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్‌ ఎపిసోడ్‌  ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీకి సీక్వెల్‌ పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘ది రాజా సాబ్‌’ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కృతి, కెమేరామేన్‌ కార్తీక్‌ పళని, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రాజీవన్‌ మాట్లాడారు.  

Advertisement
 
Advertisement
Advertisement