'ది రాజాసాబ్‌' నుంచి బిగ్‌ అప్డేట్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Prabhas Raja Saab Movie Release Date Locked, Poster Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

'ది రాజాసాబ్‌' నుంచి బిగ్‌ అప్డేట్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Jun 3 2025 10:56 AM | Updated on Jun 3 2025 11:25 AM

Prabhas Raja Saab Movie release Date Locked

ప్రభాస్‌ హీరోగా  మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్‌' (The RajaSaab).  తాజాగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్‌ ప్రకటించారు. సినిమా విడుదల తేదీతో పాటు టీజర్‌ రిలీజ్‌ వంటి అంశాలను ఒక పోస్టర్‌తో చిత్ర యూనిట్‌ తెలిపింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

రాజా సాబ్‌ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తాజాగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది. జూన్‌ 16న ఉదయం 10:52గంటలకు మూవీ టీజర్‌ రిలీజ్‌ ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ప్రభాస్‌ తన కెరీర్‌లో  చేస్తున్న తొలి రొమాంటిక్‌ హారర్‌ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. రీసెంట్‌గా విదేశాల నుంచి తిరిగొచ్చిన  ప్రభాస్‌  టీజర్‌ డబ్బింగ్‌ వర్క్‌ కూడా పూర్తిచేశారట. ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.

తాతా మనవళ్ళుగా ప్రభాస్‌
‘రాజా డీలక్స్‌’ అనే థియేటర్‌లో జరిగే హారర్‌ సీన్స్‌ ఈ సినిమాకు కీలకమని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. వాస్తవంగా ఈ సినిమా విడుదల ఏప్రిల్‌ 10న రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు చాలా సీజీ వర్క్‌ చేయాల్సి ఉండటంతో వాయిదా పడింది. ఇంకా కొంత భాగం షూటింగ్‌ పనులు కూడా ఉన్నాయట. హారర్‌ తరహా జానర్‌లో ప్రభాస్‌ ఇప్పటివరకు సినిమా చేయలేదు. దీంతో ‘రాజా సాబ్‌’ సినిమా ఎలా ఉండబోతుంది? అనే క్యూరియాసిటీ ప్రభాస్‌ అభిమానులతో పాటు ఆడియన్స్‌లోను నెలకొంది.ఈ చిత్రంలో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తాతా మనవళ్ళుగా ప్రభాస్‌ కనిపిస్తారని, ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో సీరియస్‌ హారర్‌ సీన్స్‌ ఉన్నాయని సమాచారం. 
 

Advertisement
 
Advertisement
Advertisement