
విలక్షణ నటుడు సాయి కుమార్ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు. నటుడిగానూ యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాను. ఈ ఏడాదితో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం సంతోషంగా ఉంది.
ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ ‘సంబరాల యేటిగట్టు’, నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, ‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాది రాజా’, కోన వెంకట్‌గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డిగారితో ఓ చిత్రం, మా అబ్బాయి ఆదితో కలిసి ‘ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ సినిమాలు చేస్తున్నాను. కన్నడలో ‘చౌకీదార్’, ‘సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర’, శివ రాజ్‌కుమార్‌గారి సినిమాలో నటిస్తున్నా. తమిళ్‌లో ‘డీజిల్’, విక్రమ్ ప్రభుతో ఓ చిత్రం చేస్తున్నాను. దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ ‘కన్యా శుల్కం’ వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాను’’ అని చెప్పారు.