
హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది యూనిట్. ఈ గ్యాప్‌లో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్‌పై ఫోకస్ పెట్టారట రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలిసి ఈ సినిమాలోనిపాటలు, ఆర్‌ఆర్ ఎలా ఉండాలన్న విషయాలపై చర్చలు జరుపుతున్నారట రాజమౌళి.
ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తారట కీరవాణి. ఈ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మాధవన్ మరో కీలకపాత్రలో నటిస్తారని, ఈ సినిమా కథ కథనం, భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ వచ్చే నెలలోనే ప్రారంభం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏదైనా వస్తే బాగుంటుందని మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి... మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆశ నెరవేరుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.