Director Maruthi Comments At Kotha Kothaga Movie Pre Release Event - Sakshi
Sakshi News home page

Kotha Kothaga Movie Pre Release: నన్నీ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే

Sep 7 2022 7:53 AM | Updated on Sep 7 2022 9:17 AM

Director Maruthi Comments Kotha Kothaga Movie Pre Release Event - Sakshi

డైరెక్టర్‌ మారుతి

‘‘చిన్న సినిమా సూపర్‌ హిట్టవ్వాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకణ్ణి. నన్ను ఈ స్థాయికి తెచ్చింది చిన్న సినిమానే’’ అని డైరెక్టర్‌ మారుతి అన్నారు. అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా మధ్యతరగతి కుటుంబం లాంటింది.. మధ్య తరగతి బాగుంటేనే మిగతా తరగతులు బాగుంటాయి’’ అన్నారు. ‘‘అబ్బాయికి షేక్‌ హ్యాండ్‌ కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఒక అమ్మాయి.. ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా’’ అన్నారు హనుమాన్‌ వాసంశెట్టి. ‘‘భోజనం ఎంత పెట్టినా చివర్లో స్వీట్‌ ఇస్తారు.. మా సినిమా కూడా స్వీట్‌ లాంటింది’’ అన్నారు గోవింద రాజు. ‘‘మా సినిమాని థియేటర్‌లో చూసి మంచి విజయం అందించాలి’’ అన్నారు అజయ్, వీర్తి వఘాని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement