ప్రభాస్‌ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్‌ వద్దని చెప్పిన డార్లింగ్‌ | Prabhas And Maruthi Next Movie Poster Revealed, Check Movie Title And First Look Update Inside - Sakshi
Sakshi News home page

Prabhas-Maruthi Movie First Look: ప్రభాస్‌ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్‌ వద్దని చెప్పిన డార్లింగ్‌

Published Fri, Dec 29 2023 4:45 PM

Prabhas And Maruthi Movie Poster Out Now - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన సలార్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారంలోపే రూ. 500 కోట్ల క్లబ్‌లో సలార్‌ చేరిపోయంది. ప్రభాస్‌ గత సినిమాలు రాధేశ్యామ్‌,ఆదిపురుష్‌తో పాటు సలార్‌ అన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతోనే తెరకెక్కాయి. ముఖ్యంగా సాహో, సలార్‌ సినిమాలతో ప్రభాస్‌కు మాస్‌ ఇమేజ్‌ క్రియేట్‌  అయింది. దీంతో ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది.

మారుతితో ఒక సినిమాను ఇదివరకే ప్రభాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే​ అప్డేట్​ వచ్చింది.  సంక్రాంతి పండుగ రోజు మారుతి- ప్రభాస్‌ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్​ను రిలీజ్ చేస్తున్నట్లు  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటి వరకు మీరందరూ డైనోసార్ ప్రభాస్​ను చూశారు.. ఇక త్వరలో మళ్లీ డార్లింగ్ ప్రభాస్​ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఒక పోస్ట్‌ర్‌ విడుదల చేసి చిత్ర యూనిట్‌ తెలపింది. ప్రభాస్‌ను మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఆయన్ను ఇష్టపడుతారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ను మళ్లీ వింటేజ్‌ లుక్‌లో చూడొచ్చని ఫ్యాన్స్‌ సంబర పడుతున్నారు. 

సినిమా జోనర్‌ ఏంటి
మారుతి- ప్రభాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా గురించి గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్​లో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒక బంగ్లా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టాక్‌ ఉంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌కు ఛాన్స్‌ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 150 కోట్ల లోపే ఈ సినిమాకు బడ్జెట్‌ అని సమాచారం.

ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నారని టాక్.. కానీ సినిమా విడుదలయ్యాక బడ్జెట్‌ పోను మిగిలిన ఆదాయంలో వాటా తీసుకునేలా ప్రభాస్‌ డీల్‌ సెట్‌ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. మరోవైపు 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement