
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌ను కలిసి రాజ్‌కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్‌కుమార్ కూడా ధనుష్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్‌మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.
