Prabhas And Director Maruthi Movie Launched With Pooja Ceremony, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas: ఇట్స్‌ అఫిషియల్‌: మారుతి, ప్రభాస్‌ సినిమా షురూ.. టైటిల్‌ ఇదేనా?

Aug 26 2022 10:31 AM | Updated on Aug 26 2022 11:41 AM

Prabhas And Maruthi Movie Launched With A Formal Pooja - Sakshi

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమే. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లోని సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్‌ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు.

హారర్‌–కామెడీ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్‌. అలాగే ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. ఇక ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement