సూపర్‌ ఎనర్జీ

Anu Emmanuel ready to dance - Sakshi

డ్యాన్స్‌ ఇరగదీస్తున్నారు అల్లుడు. వరుసగా రెండు సాంగ్స్‌లో అదిరిపోయే స్టెప్పులు వేశారట ఆయన. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. అల్లుడుగా నటిస్తున్న నాగచైతన్యకు అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు.

ఈ సినిమాలోని రెండు సాంగ్స్‌ను వెంట వెంటనే కంప్లీట్‌ చేశారట. ‘‘రెండు పాటలను కంప్లీట్‌ చేశాం. డ్యాన్స్‌లో నాగచైతన్య ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌. ఈ సాంగ్స్‌కు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ వహించారు’’ అని పేర్కొన్నారు డైరెక్టర్‌ మారుతి. అంతేకాకుండా హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్, డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌లతో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top