ప్రభాస్‌ సినిమాకి టైటిల్‌ మారనుందా? త్వరలోనే అప్‌డేట్‌

New Title for Prabhas and Director Maruthi Upcoming Film - Sakshi

పాన్‌ ఇండియ స్టార్‌ ప్రభాస్‌ రాధేశ్యామ్‌ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌, స్పిరిట్‌ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతీ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాలిడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా క్రేజీ రూమర్‌ చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే ఈ చిత్రానికి రాజా డీలక్స్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఆ టైటిల్‌ను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ టైటిల్‌కి పెద్దగా రెస్పాన్స్‌ లేకపోవడంతో దాన్ని మార్చాలని చూస్తున్నారట. పాన్‌ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. చదవండి: 'రాధేశ్యామ్‌'పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన తమన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top