'రాజాసాబ్‌' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్‌ | Prabhas The Raja Saab Glimpse Release Date Locked | Sakshi
Sakshi News home page

'రాజాసాబ్‌' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్‌

Jul 28 2024 1:08 PM | Updated on Jul 28 2024 3:05 PM

Prabhas The Raja Saab Glimpse Release Date Locked

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు డైరక్టర్‌ మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న'రాజాసాబ్‌' గురించి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు వారు టైమ్‌ సెట్ చేశారు. రేపు (జులై 29) సాయింత్రం 5.03 నిమిషాలకు రాజాసాబ్‌ వచ్చేస్తాడని ప్రకటించారు.

రాజా సాబ్ మూవీ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.   కామెడీ హార‌ర్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాదిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ,తమిళ్‌,కన్నడ,మలయాలం భాష‌ల్లో ఈ మూవీ విడుదల కానుంది.

తాజాగా విడుదలైన రాజాసాబ్‌ పోస్టర్‌ చాలా బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. అయితే, ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లు ఎవరనే విషయం అధికారికంగా వెలువడలేదు.  మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు ఓ రూమర్‌ అయితే ఉంది. రేపు విడుదల కానున్న గ్లింప్స్‌తో పూర్తి వివరాలు వస్తాయిని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement