Pakka Commercial-Saptagiri: బ్లాక్‌లో టికెట్స్‌ అమ్ముతు డైరెక్టర్‌కు దొరికిన కమెడియన్‌!

Pakka Commercial: Saptagiri Sell Movie Tickets In Block For Non Commercial - Sakshi

గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్‌ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్‌గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్‌లో టికెట్స్‌ అమ్ముతూ డైరెక్టర్‌ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్‌.

చదవండి: ఆ జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు

జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్‌ రేట్స్‌పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్‌ టికెట్‌ రేట్స్‌ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్‌ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్‌ చేసింది. గీతా ఆర్ట్స్‌ వారు తమ యూట్యూబ్‌ చానల్‌లో షేర్‌ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్‌ టికెట్స్‌ అమ్ముతూ డైరెక్టర్‌ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్‌ బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని  మారుతి అడగ్గా... అవును సర్‌.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్‌ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు.

చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్‌

దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్‌ కమర్షియల్‌ రెట్స్‌కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్‌ రేట్స్‌పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్‌ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్‌ చేసేందుకు పాత రెట్స్‌కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్‌ చేయండి. పాత టికెట్స్‌ రెట్స్‌కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్‌ మారుతి చెప్పుకొచ్చాడు. 

చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు: పూజా హెగ్డే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top