R Madhavan-Suriya: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్‌

Suriya Shocked After Seeing R Madhavan In Nambi Narayanan Look - Sakshi

వైవిధ్యమైన పాత్రలు, కథలతో అలరిస్తుంటాడు మాధవన్‌. తాజాగా ఆయన రాకెట్రీ అనే బయోపిక్‌తో రాబోతున్నాడు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితాన్ని ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో మాధవన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా.. పాత్ర కోసం మ్యాడీ తనని తాను పూర్తిగా మేకోవర్‌ చేసుకున్నాడు. అచ్చం నంబి నారాయణ్‌లా తెల్ల జుట్టు, కళ్లద్దాలతో కనిపించనున్నాడు.

చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు: పూజా హెగ్డే

అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన స్టార్‌ హీరో సూర్య షూటింగ్‌ చూసేందుకు నంబి నారాయణ్‌తో కలిసి సెట్‌కు వెళ్లిన ఓ దృశ్యం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సెట్‌లోకి అడుగుపెట్టగానే నంబి నారాయణన్‌ గేటప్‌ ఉన్న మాధవన్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఒక్క క్షణం ఎవరూ నిజమైన నంబి నారాయణ్‌ అని గుర్తు పట్టలేదనేంతగా ఓ షాకింగ్‌ లుక్‌ ఇచ్చాడు. ఇక సెట్స్‌లోని సూర్య, నారాయణ్‌ రాగానే కూర్చి నుంచి లేచి ఇరువురి స్వాగతం పలికాడు మ్యాడీ. అనంతరం సూర్యను తన స్నేహితుడు అంటూ నారాయణ్‌కు పరిచయం చేశాడు.

చదవండి: కొత్త కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ, ధరెంతో తెలుసా?

ఇక ఆయన సూర్యను పలకరిస్తూ.. మీ సినిమాలు చాలా బాగుంటాయని, మీ నటన అద్భుతమని కొనియాడారు. అంతేకాదు మీ నాన్నగారు(శివకూమార్‌) దర్శకత్వం కూడా తనకు బాగా నచ్చుందని చెప్పడంతో సూర్య ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా తమిళం, తెలుగులో చేస్తున్న సూర్య పాత్రలో హిందీలో షారుక్‌ ఖాన్‌ పోషిస్తున్నాడు. ఇక నంబి నారాయణ్‌ భార్య పాత్రలో సీనియర్‌ నటి సిమ్రాన్‌ కనిపించనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top