ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్‌ అనిపిస్తోంది | Sakshi
Sakshi News home page

ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్‌ అనిపిస్తోంది

Published Sun, Jan 7 2024 1:12 AM

Director Maruthi Launched Mukyagamanika teaser - Sakshi

‘‘ముఖ్య గమనిక’ టీజర్‌ చూశాను. మంచి థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్‌ క్యారెక్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్‌ మొత్తానికి బూస్టప్‌ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్‌ కజిన్‌ విరాన్‌ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ  శివిన్‌ప్రోడక్షన్స్‌ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్‌.

ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా విరాన్‌ ముత్తంశెట్టి మాట్లాడుతూ–  ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్‌ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్‌ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్‌. ‘‘మా బేనర్‌ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్‌.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement