అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపిచంద్‌ | Gopichand And Director Maruthi Interesting Comments In Pakka Commercial Promotions | Sakshi
Sakshi News home page

Gopichand-Pakka Commercial: అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్‌గా చేస్తా

Jun 29 2022 4:13 PM | Updated on Jun 29 2022 4:26 PM

Gopichand And Director Maruthi Interesting Comments In Pakka Commercial Promotions - Sakshi

మాచో స్టార్‌ గోపిచంద్‌-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్‌.  అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్‌, డైరెక్టర్‌ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా

ఈ సందర్భంగా షో హోస్ట్‌.. పక్కా కమర్షియల్‌ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్‌ సెన్స్‌ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్‌ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్‌ లెన్త్‌ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్‌లో ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్‌గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్‌.

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్‌!, కారణం ఇదేనా?

అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్‌ రోల్స్‌ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్‌ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్‌ చేశాడు. గోపిచంద్‌ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్‌ గోపిచంద్‌ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement