Nassar To Quit Acting: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్‌!, కారణం ఇదేనా?

Is Actor Nassar Going To Quit Acting Due Health Issues - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్స్‌లో నటుడు నాజర్‌ ఒకరు. దక్షిణాదిన అయన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్‌ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. నాజర్‌ లేకుండ ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు పొందారు. తండ్రిగా, పోలీసు ఆఫీసర్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయే ఆయన ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్‌ న్యూస్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. త్వరలోనే ఆయన నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారనే టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.

చదవండి: నటి మీనా భర్త విద్యాసాగర్‌ హఠాన్మరణం

యాక్టింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయనే స్వయంగా నిర్ణయించుకున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆనారోగ్య కారణాల దృష్ట్యా నాజర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో నాజర్‌ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. అప్పటి నుంచే ఆయన పలు సెలక్టెడ్‌ చిత్రాలనే చేస్తున్నారు. ఇక శాశ్వతంగా నటనకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే ఆయన దృష్టి పెట్టాలనుకుంటున్నారట. అందుకే యాక్టింగ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలని ఆయన అనుకుంటున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై నాజర్‌ నుంచి కానీ ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు: పూజా హెగ్డే

కాగా ‘కళ్యాణ అగత్తిగళ్’ చిత్రంతో నాజర్‌ నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన సౌత్‌లోనే కాదు హిందీలో కూడా పలు చిత్రాలు చేశారు. ఇక బాహుబలిలో ఆయన పోషించిన బిజ్జలదేవ పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఇది మాత్రమే కాదు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్‌ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top