మారుతితో ప్రభాస్‌ మూవీ, చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్‌! | Boycott Maruthi From TFI Trending On Twitter by Prabhas Fans | Sakshi
Sakshi News home page

#BoycottMaruthiFromTFI: ప్రభాస్‌ కొత్త సినిమా.. ఆ డైరెక్టర్‌ వద్దే వద్దంటూ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ!

Published Wed, Aug 24 2022 8:12 PM | Last Updated on Wed, Aug 24 2022 9:22 PM

Boycott Maruthi From TFI Trending On Twitter by Prabhas Fans - Sakshi

బాయ్‌కాట్‌.. ట్విటర్‌లో ఎక్కువ ట్రెండ్‌ అయ్యే హ్యాష్‌ట్యాగ్‌ ఇది. సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ను టార్గెట్‌ చేస్తూ బాయ్‌కాట్‌ను ట్రెండ్‌ చేస్తుంటారు నెటిజన్లు. కానీ ఈసారి ఏకంగా టాలీవుడ్‌లో ఓ దర్శకుడిని బాయ్‌కాట్‌ చేయాలంటూ పిలుపునివ్వడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం ట్విటర్‌లో #BoycottMaruthiFromTFI అన్న హ్యాష్‌ట్యాగ్‌ వరుస ట్వీట్లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇంతకీ డైరెక్టర్‌ మారుతిని అసలు తెలుగు ఇండస్ట్రీలో నుంచే పంపించేయాలని డిమాండ్‌ చేయడానికి కారణమేంటో తెలుసుకుందాం..

మారుతి దర్శకత్వం వహించిన తొలి సినిమా ఈ రోజుల్లో. ఈ చిత్రంతో అందరి కంట పడ్డ ఆయన తర్వాత బస్‌ స్టాప్‌ తెరకెక్కించాడు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకుని కొత్త జంట, భలే భలే మగాడివోయ్‌ సినిమాలతో సక్సెస్‌ అందుకున్నాడు. అయితే ఇటీవల ఆయన తెరకెక్కించిన పక్కా కమర్షియల్‌ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.  అది కమర్షియల్‌గా హిట్‌ కాకపోవడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో భయం మొదలైంది. రేపు ప్రభాస్‌- మారుతి సినిమా లాంఛ్‌ అవుతుండటంతో అభిమానులు రంగంలోకి దూకారు. ఇప్పుడీ సినిమా అవసరమా? వద్దేవద్దంటూ వరుస ట్వీట్లతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.

పైగా ప్రభాస్‌కు ప్రస్తుతం బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఇప్పటికే కొందరు దర్శకులకు ఛాన్స్‌ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు ప్రభాస్‌. రన్‌ రాజా రన్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన సుజిత్‌ రెండో సినిమా ప్రభాస్‌తో తీశాడు. అలా వీరి కాంబినేషన్‌లో వచ్చిన సాహో ఘోర పరాజయం పాలైంది. ప్రయాణం, సాహసం చిత్రాలకు డైలాగ్స్‌ రాసిన రాధాకృష్ణకుమార్‌ జిల్‌ మూవీతో దర్శకుడిగా మారాడు. ఆయన సెకండ్‌ మూవీ రాధేశ్యామ్‌ ప్రభాస్‌తో తీయగా అది కూడా ఫ్లాప్‌ అయింది. వరుసగా రెండు ఫ్లాప్‌లతో డీలా పడిన ప్రభాస్‌ ఇటీవలే ఫ్లాప్‌ అందుకున్న డైరెక్టర్‌ మారుతితో జత కట్టకూడదని అభిమానులు ఫిక్సయ్యారు. అందుకే నెట్టింట ఈ రచ్చ!

చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే?
సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement