Rakul Preet Singh Dress Cost: సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్‌ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Rakul Preet Singh In Black Dress Worth Rs 38 Thousands for Cuttputlli promotions - Sakshi

బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో ప్రస్తుతం అక్కడే పాగా వేసింది హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సరసన ఆమె నటించిన కట్‌పుత్లి హాట్‌స్టార్‌లో సెప్టెంబర్‌ 2న ప్రసారం కానుంది. అందులో భాగంగా శనివారం ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా మంచి స్పందన లభించింది.

మరోవైపు ఈపాటికే సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టేసిన ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు కక్కే ఫొటోలు అప్‌లోడ్‌ చేసింది. అందులో బ్లాక్‌ డ్రెస్‌ ధరించి, సిల్వర్‌ కలర్‌ చెవిపోగులతో సింప్లీ సూపర్‌ అనేలా ఉంది. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్న ఆ డ్రెస్సు ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 38 వేల రూపాయలు. ఇది తెలిసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. గౌరీ, నైనిక అనే డిజైనర్లు ఈ డ్రెస్‌ తయారు చేశారు. ఇకపోతే రకుల్‌ ప్రీత్‌ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది. సిద్దార్థ్‌ మల్హోత్రా థాంక్యూ, అయలాన్‌, చాత్రివలి, డాక్టర్‌ జీ సినిమాలు చేస్తోంది.

చదవండి: ఆ సీన్‌ చేసేటప్పుడు నవ్వాను, చిరు మామ సీరియస్‌ అయ్యారు
త్రిష నిజంగా రాజకీయాల్లోకి రానుందా? ఆమె తల్లి ఏమందంటే?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top