Prabhas Shocking Remuneration for Director Maruthi Upcoming Movie - Sakshi
Sakshi News home page

Prabhas Remunarion: మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్‌ మూవీ, హాటాటాపిక్‌గా ‘డార్లింగ్‌’ రెమ్యునరేషన్‌

Mar 18 2022 3:09 PM | Updated on Mar 18 2022 4:12 PM

Prabhas Remuneration Goes Viral For Maruthu Movie Rs 75 Crore - Sakshi

‘బాహుబలి’, ‘సాహె’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి వరకు సౌత్‌ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ప్రభాస్‌ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌ తర్వాత ప్రభాస్‌ రాధేశ్యామ్‌తో ఇటీవల ఫ్యాన్స్‌ను పలకరించాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్‌, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్‌ డైరెక్టర్‌ మారుతీ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ  చిత్రం ఉంటుందని సమాచారం.

చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్‌ తొలి ట్వీట్‌, నెటిజన్ల అసహనం

అయితే ఈ సినిమాకు ప్రుభాస్‌ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్‌ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్‌ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్‌’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్‌. వీరిలో ఉప్పెన ఫేమ్‌ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కే, ఆదిపురుష్‌, సలార్‌ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తాడని సమాచారం.

చదవండి: Ram Gopal Varma: ‘రాధేశ్యామ్‌’ మూవీపై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement