Ram Gopal Varma Shocking Comments On Radhe Shyam Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ‘రాధేశ్యామ్‌’ మూవీపై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌

Mar 18 2022 11:25 AM | Updated on Mar 18 2022 12:26 PM

Ram Gopal Varma Shocking Comments On Radhe Shyam Movie - Sakshi

Ram Gopal Varma Shocking Comments On Radhe Shyam: రామ్‌ గోపాల్‌ వర్మ నోరు విప్పితే చాలు అది వైరల్‌ అవుతుంది. సినీ, రాజకీయ ప్రముఖులపై వ్యంగ్యస్త్రాలు ఒదులుతూ కవ్విస్తుంటాడు. అలా ఎప్పుడు వివాదంలో నిలుస్తుంటాడు. ఆర్జీవీ పేరు వింటేనే వివాదం అనేంతగా మారాడు వర్మ. ఒకప్పుడు తన చిత్రాలతో ట్రెండ్‌ సట్టర్‌, బ్లాక్‌బస్టర్స్‌ హిట్స్‌ అందుకున్న ఆర్జీవీ ప్రస్తుతం వరస ప్లాప్‌లను చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాలపై తనదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నాడు వర్మ. ఈ క్రమంలో పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌ మూవీపై వర్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. 

చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్‌ ట్వీట్‌, అంత మాట అనేశాడేంటి!

ఈ మేరకు వర్మ ఒక నటుడి ముందు సినిమా అది సాధించిన వసూళ్ల ఆదారంగా తదుపరి మూవీపై అంచనాలు ఉంటాయి. ‘రాధేశ్యామ్‌లో హీరో ప్రభాస్‌ పారితోషికం పక్కన పెడితే.. ఈ చిత్రం మొత్తం బడ్జెట్‌లో 5వ వంతు ఖర్చుతో సినిమా తీసేయవచ్చు. రాధేశ్యామ్‌ వంటి ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ అభిమానులకు విజువల్‌ ఫీస్ట్‌ అవసరం లేదు.  కథలోని భావోద్వేగం, భావాలను విజువల్‌ ఫిస్ట్‌ డ్యామినేట్‌ చేస్తాయి, ఇది కథను చంపేస్తుంది’ అని అన్నాడు. ఇక బాలీవుడ్‌ చిత్రం ది కశ్మీర్‌ ఫైల్స్‌ గురించి విడుదలయ్యే వరకు ఎవరికి తెలియదు, కేవలం రూ. 4 కోట్లనుంచి రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ ఇప్పుడు రూ. 100 కోట్ల వసూళు సాధించిందనిపేర్కొన్నాడు.

చదవండి: Hanuman: నో డూప్‌, ఎనిమిది గంటల పాటు తాడు పైనే!

అదే రాధేశ్యామ్‌ మూవీకి పెట్టిన బడ్జెట్‌, వచ్చిన వసూళ్లకు పొంతన లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఒక మూవీకి విజువల్‌ ఎఫేక్ట్స్‌ కంటే కథలో ఉండే దమ్ము ముఖ్యమని ఈ రెండు సినిమాలు నిరూపించాయని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అతడి కామెంట్స్‌పై పలువురు ‘అంటే తక్కువ బడ్జెట్‌తో అయిపోయే రాధేశ్యామ్‌ మూవీని కావాలనే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌ సినిమా చేశారని’ అంటున్నారా వర్మ అని స్పందిస్తున్నారు. రాధేశ్యామ్‌ను రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement