Actor Dhanush Tweet On His Ex-Wife Aishwarya Rajinikanth After Divorce, Details Inside - Sakshi
Sakshi News home page

Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్‌ తొలి ట్వీట్‌, నెటిజన్ల అసహనం

Mar 18 2022 8:53 AM | Updated on Mar 18 2022 9:28 AM

Dhanush Tweet About His Ex Wife Aishwarya Rajinikanth Called Friend - Sakshi

Dhanush Tweet On Ex Wife Aishwarya Rajinikanth: కోలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ధనుష్‌-ఐశ్యర్య రజనీకాంత్‌లు విడిపోవడాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికి షాకిచ్చారు. విడిపోయాక ధనుష్‌-ఐశ్యర్యలు ఎవరి పనుల్లో వారు బిజీ ఉన్నారు. కానీ వీరి అభిమానులు, సన్నిహితులు మాత్రం వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. అంతేకాదు వీరి నుంచి ఏమైన తీపి కబురు అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్‌ చేశాడు ధనుష్‌.

చదవండి: ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్‌, 20న సెకండ్‌ సింగిల్‌

ఈ సందర్భంగా ఐశ్యర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ధనుష్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ మారింది. ఇదిలా ఉంటే ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిన ఓ పాట గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్‌ వీడియోపై ధనుష్‌ ట్వీట్‌ చేశాడు. ‘‘పయని’ మ్యూజిక్‌ వీడియోకు దర్శకత్వం వహించిన నా స్నేహితురాలు ఐశ్యర్య.ఆర్‌.ధనుష్‌కు శుభాకాంక్షలు. గాడ్‌ బ్లెస్‌’’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ధనుష్‌ తీరు చూసిన నెటిజన్లు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడాకులు ప్రకటన అనంతరం కూడా ఐశ్యర్య తన ట్విటర్‌ ప్రోఫైల్‌ పేరు పక్కన ధనుష్‌ పేరును అలాగే ఉంచింది.

చదవండి: సౌందర్య, రంభ ఉన్నారని సంతోషపడ్డా.. హీరోగా నన్ను తీసేశారు : శ్రీకాంత్‌

కానీ ధనుష్‌ మాత్రం ఆమెను స్నేహితురాలు అని పిలవడం నచ్చడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశిస్తున్న ఫ్యాన్స్‌ ‘ఏంటి అన్న అలా అనేశావ్‌’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ఐశ్యర్య-ధనుష్‌లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిచన ఈ మ్యూజిక్‌ వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించారు. ఈ వీడియో తమిళ వెర్షన్‌ను సూపర్‌‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌‌లాల్ రిలీజ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement