ధనుష్‌, ఐశ్వర్య రజినీకాంత్‌లకు కోర్టు ఉత్తర్వులు | Court Orders For Dhanush And Aishwarya Rajinikanth To Appear Physically | Sakshi
Sakshi News home page

హీరో ధనుష్‌, ఐశ్వర్య రజినీకాంత్‌లకు కోర్టు ఉత్తర్వులు

Published Tue, Apr 16 2024 6:47 AM | Last Updated on Tue, Apr 16 2024 8:40 AM

Court Orders For Dhanush And Aishwarya Rajinikanth - Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి  యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు. 

ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా  చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది.  పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వారి పిటిషన్‌ను న్యాయమూర్తి సుభాదేవి విచారించారు.  అక్టోబరు 7న చెన్నై ఫ్యామిలీ కోర్టులో   ధనుష్‌, ఐశ్వర్య ఇద్దరూ విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు.

2022 నుంచి వేర్వేరుగా ఉంటున్న ఈ జంట పలు సినిమా నిర్మాణంలో బిజీగానే ఉంటున్నారు. వారి కుమారులు యాత్ర, లింగ మాత్రం ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. కానీ వారిద్దరూ కూడా అప్పడప్పుడు ధనుష్‌ వద్దకు వెళ్లి వచ్చేవారు. ఏదేమైనా సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ స్టార్‌ కపుల్స్‌ ఈ సంవత్సరంలో విడాకులు తీసుకుని తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారనే విషయాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement