‘సర్కారు వారి పాట’ అప్‌డేట్‌, 20న సెకండ్‌ సింగిల్‌ | Second Single Release From Sarkaru Vaari Paata On March 20th | Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: 20న సెకండ్‌ సింగిల్‌

Mar 18 2022 8:00 AM | Updated on Mar 18 2022 8:31 AM

Second Single Release From Sarkaru Vaari Paata On March 20th - Sakshi

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి జాన్వీ కపూర్‌ మూవీ! ఎక్కడంటే?

మే 12న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘పెన్నీ..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంటూ, ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘పెన్నీ’ అంటున్నారు కాబట్టి ‘డబ్బు’ నేపథ్యంలో ఈ పాట సాగుతుందని ఊహించవచ్చు. ‘‘భారీ అంచనాలతో రూపొందుతోన్న ‘సర్కారువారి పాట’ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మా చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘కళావతి..’ ఇప్పటికే 90 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ‘పెన్నీ..’ పాటకి కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement