పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో | Prathi Roju Pandage Sets, Hero Sai Dharam Tej Playing With Kids | Sakshi
Sakshi News home page

పిల్లలతో ఆడుకుంటోన్న సుప్రీం హీరో

Aug 31 2019 6:13 PM | Updated on Mar 20 2024 5:24 PM

చిత్రలహరి సినిమాతో సక్సెస్‌ చూసిన మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. మునుపటిలా మాస్‌ ఫార్ములా అంటూ చూడకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలను సెలెక్ట్‌ చేసుకుంటోన్నట్లు కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఈ హీరో ప్రతిరోజూపండుగే అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీ అని తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో ఉన్నప్పుడు.. పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్న వీడియోను సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పిల్లలతో కలిసి ఆడుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ వీడియోను పోస్ట్‌ చేశాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement