
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్, మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి, చేసి వదిలేశాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్‌తో ‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలైంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్‌కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్యగమిడి, సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కమర్ చావ్ల.