ఆస్కార్‌లో సందడిగా కనిపించిన రాజ్‌.. కొత్త మూవీ కోసం శిక్షణ | Telugu Actor Raj Dasireddy Shines at Oscars 2025 | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌లో సందడిగా కనిపించిన రాజ్‌.. కొత్త మూవీ కోసం శిక్షణ

Oct 22 2025 3:23 PM | Updated on Oct 22 2025 3:30 PM

Actor Raj Dasireddy will upcoming movie plan

ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా... హిందీ ఇండస్ట్రీని "బాలీవుడ్", కన్నడ పరిశ్రమను "శాండల్ వుడ్", మలయాళంను "మల్లువుడ్", తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని "కోలీవుడ్"గా పిలుచుకుంటున్నామంటే... దానికి ప్రేరణ "హాలీవుడ్" అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా.... మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే... దానిని "హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం. అంతేకాదు... సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం "ఆస్కార్"ను అందించేది కూడా హాలివుడ్డే. అందుకే "RRR" చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... ఇంతటి ప్రతిష్టాత్మక ఆస్కార్ సంబరాల్లో (97వ అకాడమీ అవార్డ్స్ లో) ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు. చాలా అరుదుగా మాత్రమే లభించే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు నటుడి పేరు "రాజ్ దాసిరెడ్డి".. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు" చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి... ఆస్కార్ - 2025 వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకొని, అక్కడకు వెళ్లడంతోపాటు, "హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్" "న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ - 2025"లోనూ సందడి చేశాడు. యాక్షన్ ఎంటర్టైర్గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. . అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement