పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్! | Tollywood Hero Nara Rohith to Marry Sireesha on October 30 — Grand 4-Day Wedding in Hyderabad | Sakshi
Sakshi News home page

Nara Rohit Marriage: పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్!

Oct 22 2025 2:27 PM | Updated on Oct 22 2025 3:00 PM

Nara Rohit and Sirisha wedding date announced

టాలీవుడ్‌లో హీరో నారా రోహిత్‌ (Nara Rohith) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు శిరీష మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవలే శిరీష సోషల్‌ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమం అంటూ ఫోటోలను షేర్‌ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.

తాజాగా నారా రోహిత్‌- శిరీషల పెళ్లి వేడుకకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వీరి గ్రాండ్‌ వెడ్డింగ్‌ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్‌ రమేశ్ బాలా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా జరగనుంది.

(ఇది చదవండి: నారా రోహిత్‌ పెళ్లి సందడి.. హీరోయిన్‌ ఇంట హల్దీ ఫంక్షన్‌)

ఆ సినిమాతో శిరీషతో పరిచయం..

‍నారా రోహిత్‌ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్‌ చేసింది. ఈ మూవీలో రోహిత్‌ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్‌ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

రోహిత్ కెరీర్..

బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్‌. సోలో మూవీతో హిట్‌ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్‌ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement