
టాలీవుడ్‌లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లికి సమయం ఆసన్నమైంది. రోహిత్-శిరీష (Siree Lella) జంట ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని శిరీష సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పసుపు దంచే కార్యక్రమం జరిగిందంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబైన శిరీష.. తన కుటుంబసభ్యులతో కలిసి పసుపు దంచింది.

ఆ సినిమాతో ప్రేమ షురూ
నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్‌మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
సినిమా
బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.
చదవండి: బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్