
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కోసం పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు శనివారం నాడు ఈ పార్టీకి హాజరయ్యారు.

అందుకోసమే ఈ పార్టీ!
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చిరంజీవి, శ్రీకాంత్ ఒకే కారులో నుంచి దిగారు. చిరు కారు దిగగ్గానే బండ్ల గణేశ్ ఆయన పాదాలకు నమస్కరించాడు. తర్వాత చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టాడు. కాగా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే క్రమంలోనే శనివారంనాడు దీపావళి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..