
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు.
Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?
Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025