
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.
తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్‌లో షేర్ చేసింది. యంగ్ టైగర్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది.
అమెరికా కాన్సులేట్‌కు విచ్చేసిన ఎన్టీఆర్‌ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.
కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్‌లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.
Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl
— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025