అరటిపండ్లు అమ్మా, నెంబర్‌ ప్లేట్లు తయారు చేశా.. మారుతి | Director Maruthi About His Life and The Raja Saab Movie | Sakshi
Sakshi News home page

Maruthi: మారుతి జీవితంలో ఇన్ని కష్టాలా? రాజా సాబ్‌ సినిమా గురించి ఏమన్నారంటే?

Jun 8 2025 3:38 PM | Updated on Jun 16 2025 4:39 PM

Director Maruthi About His Life and The Raja Saab Movie

సాక్షి, మచిలీపట్నం: జీవితం అందరికీ పూలపాన్పు కాదు. ఎన్నో కష్టాలు చూసిన తర్వాత కానీ విజయాలు సొంతం కావు. దర్శకుడు మారుతి (Maruthi) జీవితం కూడా అంతే! ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేశాడు. టాలీవుడ్‌లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. తనకు కట్నంగా వచ్చిన డబ్బుతో ఆర్య సినిమా కొని డిస్ట్రిబ్యూటర్‌గా హిట్టందుకున్నాడు. తర్వాతి కాలంలో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో హిట్లు, ఫ్లాపులు అన్నీ చూశాడు. 

హారర్‌ జానర్‌
అంతెందుకు, 2022లో ఆయన చివరగా తీసిన పక్కా కమర్షియల్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం అందుకుంది. అయినా సరే తనకు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రభాస్‌ (Prabhas)తో ద రాజా సాబ్‌ (The Raja Saab Movie) అనే హారర్‌ కామెడీ మూవీ చేస్తున్నాడు. తాజాగా మారుతి.. మచిలీపట్నంలో నిర్వహిస్తున్న మసులా బీచ్‌ ఫెస్టివల్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1999లో హైదరాబాద్‌కు వెళ్లాను. అంతకుముందు వైజాగ్‌లో అరటిపండ్లు అమ్మేవాడిని. ఇక్కడ రాధికా థియేటర్‌ ఎదురుగా నాన్నకు అరటిపండ్ల బండి ఉండేది. 

బొమ్మలు గీసుకునేవాడిని
నేను కూడా అక్కడ పండ్లు అమ్ముతూ.. సినిమాలు రిలీజైనప్పుడు వాటిని చూసి నా నోట్‌బుక్‌లో బొమ్మలు గీసుకుంటూ ఉండేవాడిని. తర్వాత 1999లో హైదరాబాద్‌కు వచ్చాను. అప్పుడు నాకు స్టిక్కరింగ్‌ షాపు ఉండేది. నెంబర్‌ ప్లేట్లు తయారు చేసేవాడిని. హిందూ కాలేజీలో చదువుకుంటూనే నెంబర్‌ ప్లేట్లు రెడీ చేసేవాడిని. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి కష్టపడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే! రూ.400 కోట్ల బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీ తీస్తున్నా.. 

అంచనాలు పెంచేసిన మారుతి
రాజా సాబ్‌ మీరు ఊహించినదానికంటే ఒకశాతం ఎక్కువే ఉంటుంది. జూన్‌ 16న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నాం అని రాజాసాబ్‌పై అంచనాలు పెంచేశాడు మారుతి. అటు ఎక్స్‌ (ట్విటర్‌)లోనూ ఒట్టేసి చెబుతున్నా.. రాజా సాబ్‌ మూవీ ఓ వేడుకలా ఉంటుందని ట్వీట్‌ చేశాడు. మారుతి దర్శకుడిగా ఈ రోజుల్లో, బస్‌స్టాప్‌, ప్రేమకథా చిత్రం, భలే భలే మగాడివోయ్‌, ప్రతిరోజు పండగే, బాబు బంగారం, మంచి రోజులొచ్చాయ్‌.. ఇలా పలు సినిమాలు చేశాడు.

 

 

చదవండి: ప్రభాస్‌ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement