నేను చేసిన ఐదు సినిమాలు ముందు నాగచైతన్యకే చెప్పా: వెంకీ అట్లూరి | Venky Atluri: Every Film Narrated to Naga Chaitanya | Sakshi
Sakshi News home page

Venky Atluri: నేను రాసిన ప్రతి కథ నాగచైతన్యకే చెప్పా.. వర్కవుట్‌ అవట్లే!

Jun 29 2025 3:02 PM | Updated on Jun 29 2025 3:20 PM

Venky Atluri: Every Film Narrated to Naga Chaitanya

సార్‌, లక్కీ భాస్కర్‌ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్నాడు డైరెక్టర్‌ వెంకీ అట్లూరి (Venky Atluri). ప్రస్తుతం హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. దర్శకుడిగా ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసిన వెంకీ అట్లూరి.. వాటన్నింటినీ ముందుగా అక్కినేని నాగచైతన్యకు వినిపించాడట! తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. అక్కినేని ఫ్యామిలీ అంటే నాకిష్టం. మీరు నమ్ముతారో, లేదో కానీ.. ఇప్పటివరకు రాసుకున్న ప్రతి కథ మొదటగా నాగచైతన్యకే చెప్పాను.

వర్కవుట్‌ కాలే
ఈరోజు వరకు నేను తీసిన ఐదు సినిమాలు ప్రతీది చైతన్య (Naga Chaitanya)కే చెప్పాను. కానీ, డేట్స్‌ కుదరక.. లేదా ఏదో ఒక కారణం వల్ల మా కాంబినేషన్‌లో సినిమా వర్కవుట్‌ కావడం లేదు. నెక్స్ట్‌ టైం అయినా కలిసి మూవీ చేద్దామని జోక్‌ చేసుకుంటూ ఉంటాం. అఖిల్‌కు మంచి హిట్టు ఇవ్వలేకపోయానన్న బాధ ఉంది. తనతో భవిష్యత్తులో కచ్చితంగా ఓ మంచి మూవీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. 

సినిమా
వెంకీ అట్లూరి.. అఖిల్‌తో మిస్టర్‌ మజ్ను మూవీ చేశాడు. ప్రస్తుతం సూర్యతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. మమితా బైజు, రాధికా శరత్‌ కుమార్‌, రవీనా టండన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

చదవండి: నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

Advertisement
 
Advertisement
Advertisement