Santosh Sobhan Speech At Prem Kumar Movie - Sakshi
Sakshi News home page

ప్రేమ్‌కుమార్‌..కడుపుబ్బా నవ్విస్తాడు: సంతోష్‌ శోభన్‌

Aug 7 2023 9:13 AM | Updated on Aug 7 2023 9:30 AM

Santosh Shoban Talk About Prem Kumar Movie - Sakshi

లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం ప్రేమ్‌కుమార్‌ అని, దీనిలో కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బా నవిస్తుందని ఆ సినిమా హీరో సంతోష్‌శోభన్‌ అన్నారు. ఈ నెల 18న విడుదల కానున్న ప్రేమ్‌కుమార్‌ చిత్రయూనిట్‌ సభ్యులు ఆదివారం నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంతోష్‌శోభన్‌ మాట్లాడుతూ పెళ్లి కోసం పాట్లు పడే క్యారెక్టర్‌లో తాను కొత్తగా కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాశీసింగ్‌, రుచిత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని తెలిపారు. వారిలో ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు.

ఈ చిత్రంలో నటించిన వారందరూ వారి పాత్రలకు తగిన న్యాయం చేశారన్నారు. విజయవాడ నుంచి తమ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు అభిషేక్‌ మహర్షి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిర్మించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్‌ రాశీసింగ్‌ మాట్లాడుతూ తన మొదటి చిత్రం సంతోష్‌ శోభన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహనటుడు కృష్ణచైతన్య, అనిరుద్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement