ప్రభాస్‌ సినిమా.. 70 ఏళ్ల వయసులో గోడ దూకిన నటుడు | Anupam Kher Climbs Wall to Reach Prabhas Fauji Movie Set in Hyderabad | Sakshi
Sakshi News home page

Anupam Kher: ప్రభాస్‌ మూవీ! గోడ దూకి సెట్‌లోకి వెళ్లిన 70 ఏళ్ల నటుడు

Jun 8 2025 2:34 PM | Updated on Jun 8 2025 3:03 PM

Anupam Kher Climbs Wall to Reach Prabhas Fauji Movie Set in Hyderabad

సినిమా కోసం కొన్నిసార్లు విన్యాసాలు చేయక తప్పదంటున్నాడు బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher). అదేదో సినిమాలో స్టంటనుకునేరు, కానే కాదు సినిమా సెట్‌కు వెళ్లేందుకు స్టంట్‌ చేయాల్సి వచ్చింది. అనుపమ్‌ ఖేర్‌.. ప్రభాస్‌ ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. అయితే సెట్‌లోకి వెళ్లేందుకు అనుపమ్‌ గోడ దూకాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఇదే తొలిసారి
నా 40 ఏళ్ల జర్నీలో ఎన్నో రకాలుగా షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లాను. కానీ ఈరోజు ఇలా సెట్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి, ప్రత్యేకం కూడా! హైదరాబాద్‌లో ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ సెట్‌కు బయలుదేరాం. మా డ్రైవర్‌ దాన్ని సాహసోపేతంగా మార్చాలనుకున్నాడేమో బహుశా.. ఏకంగా అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చాడు. తీరా డెడ్‌ ఎండ్‌కు చేరుకున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. 

గోడ దూకి సెట్‌లోకి..
కారు రివర్స్‌ తీద్దామని ప్రయత్నించినా వీలు కాలేదు. మా పక్కనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. దీంతో గోడ దూకి సెట్‌లోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన జనాలు.. కెరీర్‌ తొలినాళ్లలో ముసలి వ్యక్తిగా నటించారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో అడవిలో ఈ స్టంట్లు చేస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది.

 

 

చదవండి: చెట్టు వెనక్కెళ్లి దుస్తులు మార్చుకోమన్నారు.. అప్పుడు బిగ్‌బీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement