The Labubu Doll : సెలబ్రిటీలందరి నోటా లబుబు డాల్‌... అసలేంటిది? | The Labubu Doll Ananya Panday To Rihanna Everyone Talking About check here | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీలందరి నోటా ఒకటే మాట‘ లబుబు డాల్‌’... అసలేంటిది?

Jun 6 2025 10:10 AM | Updated on Jun 6 2025 10:26 AM

The Labubu Doll Ananya Panday To Rihanna Everyone Talking About check here

విచిత్రమైన దంతాలు , ఇంతింత కళ్లు, కుందేలు చెవులు ఇపుడు ఎక్కడ చూసినా ఈ లబుబు డాల్స్‌ (The Labubu Doll)  ట్రెండ్‌ ప్రముఖంగా  నిలుస్తోంది.  ఇంత పాపులరైన ఈ లబుబు బొమ్మలను చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఉత్పత్తి చేస్తోంది. బ్లాక్‌పింక్ లిసా, రిహన్న, అనన్య పాండే  ఇంకా  అనేక మంది సెలబ్రిటీలు, డాల్‌ లవర్స్‌ ఈ బొమ్మల పట్ల ఎందుకంత క్రేజీగా ఉన్నారో తెలుసుకుందామా..

‘బొమ్మల్లో లబుబు బొమ్మలు వేరయా!’ అంటన్నారు డాల్స్‌ ప్రేమికులు. సామాన్యుల నుంచి అనన్య  పాండేలాంటి సెలబ్రిటీల వరకు లబుబు బొమ్మలకు ‘లవ్‌ యూ’ చెబుతున్నారు.

> జానపద కథల నుంచి స్పూర్తి పొంది హాంకాంగ్‌ ఆర్టిస్ట్‌ కసింగ్‌ లుంగ్‌ ‘లబుబు’ను రూపొందించాడు. విశాలమైన నేత్రాల ఈ బొమ్మ 2019లో మార్కెట్‌లోకి వచ్చింది. బ్యాగులు, కీచైన్‌లు....మొదలైన ఎన్నో రూపాల్లో లబుబు బొమ్మలను రూ పొందించారు. లబుబును ‘అన్‌బాక్సింగ్‌ ట్రెండ్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిని బ్లైండ్‌ బాక్సుల్లో మాత్రమే విక్రయిస్తుంటారు. అన్‌బాక్సింగ్‌ తరువాత మాత్రమే ఆ బొమ్మ గురించి తెలుసు కోగలుగుతాం.

‘లబుబు’కు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న స్పందనకు ఆ బొమ్మ సృష్టికర్త కసింగ్‌ లుంగ్‌ సంతోషిస్తున్నాడు. ‘నా చిన్నప్పుడు గేమ్‌ కన్సోల్స్, కంప్యూటర్‌లు లేవు. పెన్నుతో రకరకాల బొమ్మలను పేపర్‌పై గీసేవాడిని. బొమ్మలు తయారుచేయాలనే ఆసక్తి చిన్న వయసులోనే ఉండేది’ అంటున్నాడు కసింగ్‌ లుంగ్‌. 

Advertisement
 
Advertisement
Advertisement