స్టయిల్‌గా చెప్తా! | Actress Faria Abdullah new Fashion Look | Sakshi
Sakshi News home page

స్టయిల్‌గా చెప్తా!

Jan 4 2026 6:25 AM | Updated on Jan 4 2026 6:25 AM

Actress Faria Abdullah new Fashion Look

‘నేను ట్రెండ్స్‌ను ఫాలో కాను, సెట్‌ చేస్తాను’ అని చెప్పకనే చెబుతోంది ఫారియా అబ్దుల్లా. ఆమెకు దుస్తులు కేవలం అలంకారం మాత్రమే కాదు, తన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఒక స్టేట్‌మెంట్‌. ఇప్పుడు ఆ స్టయిల్‌ వెనుక ఉన్న ఫ్యాషన్  టిప్స్‌ మీకోసం!

చీర.. బ్రాండ్‌: కంకటాల ధర రూ. 22,167

జ్యూలరీ బ్రాండ్‌: ది జ్యూయల్‌ గ్యాలరీ
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఇండోవెస్ట్రన్‌ ఫ్యూజన్‌ స్టయిల్‌ నాకు ఆటస్థలం లాంటిది. చీరలు ఎప్పటికీ ట్రెండీనే కానీ, వాటిని కొత్తగా, సరదాగా మలచడమే నా ఫ్యాషన్ . వేసుకునే ఆభరణాలు, రంగులు కూడా మాట్లాడుతాయన్న నిజం ఈ మధ్యే అర్థమైంది. అందుకే, నేను దుస్తులను, నా వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా చెప్తుంటాను. – ఫారియా అబ్దుల్లా. 

చిన్న ఆభరణం పెద్ద మెరుపు!
ముఖాన్ని చూస్తే ముందుగా కనిపించేది కళ్ల మెరుపు అయితే, ఆ మెరుపును మరింత మాయాజాలంగా మార్చేది ముక్కు పుడకనే చెప్పాలి. సంప్రదాయంలో పుట్టిన ఈ చిన్న ఆభరణం, నేటి రోజుల్లో ఫ్యాషన్  ప్రపంచంలోనూ అడుగుపెట్టి, ఒక సిగ్నేచర్‌ స్టేట్‌మెంట్‌గా మారింది. ఒక సన్నని బంగారు వలయం ముఖానికి సౌమ్యతను ఇస్తే, కుందన్ , పోల్కీ, ముత్యాలు, రంగురాళ్లతో మెరిసే నోస్‌ రింగ్స్‌ లుక్‌కి ప్రత్యేకమైన మెరుపు అద్దుతున్నాయి.

పట్టు చీరతో పెద్ద డిజైన్  నోస్‌ రింగ్స్‌ రాయల్‌ టచ్‌ ఇస్తే, కుర్తీ లేదా ఫ్యూజన్  డ్రెస్సులతో చిన్న స్టోన్  రింగ్‌ ట్రెండీ టచ్‌ను ఇస్తుంది. ఇక మోడ్రన్  డ్రెస్సుల్లో స్లీక్‌ హూప్‌ స్టయిల్‌ నోస్‌ రింగ్స్‌ బాగుంటాయి. పింక్, రెడ్‌ స్టోన్స్, ఓపెన్  డిజైన్స్, లైట్‌వెయిట్‌ హూప్స్‌ ఇప్పుడు యువతలో హాట్‌ ఫేవరెట్‌. ఇలా వివిధ డిజైన్స్‌తో, బంగారం, వెండి, ఆర్టిఫిషియల్‌ ఆప్షన్లలో అన్ని బడ్జెట్‌లకు సరిపోయేలా మార్కెట్‌లోనూ, ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement