ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, కర్మాగారాలు, కార్ఖానాలు, బస్సులు, రైళ్లు, విమానాశ్రయాలు, విద్యాసంస్థలు, చివరకు దేవాలయాల్లో జరిగిన చోరీల కథలు ఎన్నో విన్నాం. అయితే హైదరాబాద్‌కు చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా నాంపల్లి కోర్టులో చోరీకి పథకం వేసింది. రహస్య పత్రాలు, విలువైన వస్తువులు, సాక్ష్యాధారాలను చేజిక్కించుకోవడానికి ఈ పథకం వేసి ఉంటారని భావిస్తే తప్పులో కాలేసినట్లే!
దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగిన ‘సిటీ డాన్’ సయ్యద్ అబెద్ హుస్సేన్ అలియాస్ అలీ భాయ్ సూత్రధారిగా జరిగిన ఈ కుట్రను అమలు చేయడం ద్వారా కోర్టు స్వాధీనంలో ఉన్న రూ.2.5 కోట్ల నకిలీ నోట్లు తస్కరించాలని భావించారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2009 ఆగస్టులో ఈ కుట్రను ఛేదించారు.
మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన అలీ భాయ్ హైదరాబాద్‌లో మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడటంతో పాటు అపహరణలకు పథకం వేశాడు. 2001లో టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి కుమార్తెను కిడ్నాప్ చేయించాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు బాలికను రెస్క్యూ చేయడంతో పాటు అలీ భాయ్ అనుచరులను అరెస్టు చేశారు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నకిలీ పాస్‌పోర్టు సాయంతో దుబాయ్ పారిపోయిన అలీ భాయ్ అక్కడే మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో చేరాడు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని పుణే, ముంబైలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ పలు నేరాలు చేయించాడు. 2007 మార్చిలో హైదరాబాద్ వచ్చిన అలీ భాయ్‌ని అరెస్టు చేసిన పోలీసులు, అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అదే సవుయంలో అదే జైల్లోనే ఉన్న విప్లవ దేశభక్త పులులు (ఆర్‌పీటీ) సంస్థ వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ కలిసి జైలు నుంచే బేగంపేటలోని కంట్రీక్లబ్ నిర్వాహకుడు రాజీవ్‌రెడ్డి కిడ్నాప్‌నకు కుట్ర పన్నారు. బయట ఉన్న తమ అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలు చేయాలని భావించారు. దీన్ని పసిగట్టిన వుధ్య వుండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి సోదరుడితో పాటు ముఠా మొత్తాన్ని అరెస్టు చేశారు.
ఆ ఉదంతం తర్వాత అలీభాయ్‌ని చంచల్‌గూడ నుంచి చర్లపల్లికి వూర్చారు. అక్కడ అలీ భాయ్ వనస్థలిపురానికి చెందిన మహ్మద్ దావూద్ జకీర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఇతడిపై కర్ణాటకలోనూ భారీ చోరీలు, దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన దావుద్ అనేకసార్లు ములాఖత్‌కు వచ్చి రహస్యంగా అలీభాయ్‌కి సెల్‌ఫోన్లు అందించాడు. అలీ వాయిదాల కోసం నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడూ వీరిద్దరూ మాట్లాడుకున్నారు.
పంజగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో 2008లో చోటు చేసుకున్న వ్యాపారవేత్త రాజీవ్ సిసోడియా హత్య కేసులో అరెస్టుయిన వాళ్లల్లో జహీరాబాద్‌కు చెందిన వుక్సూద్ ఒకడు. ఇతనికి జైల్లో ఉండగా అలీభాయ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ఇతగాడు తాను రయీజ్ అనే నేరగాడితో కలిసి జహీరాబాద్‌లో ఉన్న ఓం ప్రకాష్ దత్తప్ప జ్యువెలర్స్‌లో దోపిడీ చేయాలని 2007లోనే పథకం వేశానని, అయితే కార్యాచరణలో పెట్టలేకపోయానని అలీభాయ్‌కి చెప్పాడు. ఆ పథకాన్ని అమలు చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించాలని భావించిన అలీ భాయ్ అదే విషయాన్ని దావుద్‌కు చెప్పాడు.
అలీభాయ్ ఆదేశాల మేరకు దావుద్... రయీజ్‌ను కలిసి జహీరాబాద్‌లోని ఆ జ్యువెలర్స్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆ దుకాణాన్ని యజమాని ప్రతిరోజూ రాత్రి 9.00–9.30 వుధ్య వుూసేసి, విలువైన బంగారు నగలతో ఇంటికి వెళ్తాడని గుర్తించారు. దుకాణం నుంచి ఇంటికెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆయనను దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని జైలులో ఉన్న అలీ భాయ్‌కు చెప్పి, అతడి ఆదేశాల మేరకు బీదర్‌కు చెందిన సంతోష్‌ను తమతో కలుపుకున్నారు. దోపిడీ కోసం బీదర్‌కు చెందిన జగ్గు అలియాస్ జగదీష్ నుంచి కొన్ని కత్తులు కొన్నారు.
ఈ నగల దుకాణంతో పాటు నాంపల్లి కోర్టులోనూ చోరీ చేయాలని అలీభాయ్ పథకం వేశాడు. దీన్ని అవులు చేయాలని దావుద్, వుుస్తాక్‌లకు ఆదేశాలు ఇచ్చాడు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీ అంతర్జాతీయ నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టును రట్టు చేశారు. దుబాయ్ నుంచి పాత పేపర్ల పేరుతో ముంబై మీదుగా హైదరాబాద్‌కు రూ.2.5 కోట్ల నకిలీ కరెన్సీ వచ్చాయి. పాత న్యూస్ పేపర్ల మధ్యలో ఈ కరెన్సీని ఉంచిన గ్యాంగ్ గుట్టుగా కంటైనర్‌లో పాతబస్తీకి వచ్చిన ఈ ఫేక్ కరెన్సీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉన్న పవర్ ప్రెస్‌లో ముద్రితమైన ఈ కరెన్సీ అసలు నోట్లకు దీటుగా ఉంది. నిపుణులు మినహా ఎవరూ కనిపెట్టే ఆస్కారం లేకుండా ముద్రించారు. అప్పట్లో నగర నేర పరిశోధన విభాగం దర్యాప్తు చేసిన ఆ కేసు విచారణ నాంపల్లి కోర్టులో సాగింది. దీంతో ఆ నకిలీ కరెన్సీని కోర్టులోని ప్రాపర్టీ రూమ్‌లో భద్రపరిచారు. ఈ నోట్లను కూడా చోరీ చేయవుని అలీ భాయ్ చెప్పడంతో దావుద్, వుుస్తాక్‌లు కోర్టు పరిసరాల్లోనూ రెక్కీ నిర్వహించారు. ఈ రెండు నేరాలు చేయడానికి అనువైన సవుయం కోసం ఎదురుచూశారు.
ఈ రెండు పథకాల అమలుకు ముందే కుట్రలపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నేరాలు చేయడానికి అవసరమైన కారును చోరీ చేయాలనే ఉద్దేశంతో దావుద్, రయీజ్, సంతోష్‌లు నాంపల్లి ప్రాంతంలో 2009 ఆగస్టు 6న రెక్కీ నిర్వహించారు. అప్పటికే వీరిపై కన్నేసి ఉంచిన టాస్క్‌ఫోర్స్ బృందం ముగ్గురినీ పట్టుకుని, వుూడు కత్తులు స్వాధీనం చేసుకుంది. వీరి వాంగ్మూలం ఆధారంగా జగదీష్‌ను పట్టుకున్నారు. అప్పటికే జైల్లో ఉన్న అలీ భాయ్‌ని ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్‌పై అరెస్టు చేశారు.
జహీరాబాద్ కుట్ర విజయవంతమైనా కాకపోయినా, ఆశించిన మొత్తం దక్కకపోయినా... చేతినిండా డబ్బు ఉండాలనే కోర్టులోని నకిలీ నోట్లను తస్కరించాలని భావించామని, దీన్ని సాధారణ కరెన్సీ మాదిరిగా చలామణి చేయాలని భావించామని నిందితులు బయటపెట్టారు.


