 
													అలనాటి అందాల భామ, బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి చాలా రోజుల తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 24 ఏళ్ల పాటు విదేశాల్లో ఉన్న నటి.. ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సన్యాసిగా మారి బ్యూటీ మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన కోసం గోరఖ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా మమతా వివాదాస్పద కామెంట్స్తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ మమతా ఎలాంటి కామెంట్స్ చేసింది? అవీ వివాదానికి ఎందుకు దారితీశాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం టెర్రిరిస్ట్ కాదంటూ క్లీన్ చీట్ ఇచ్చిపడేసింది మమతా కులకర్ణి. అతను ముంబయిలో పేలుళ్లకు పాల్పడలేదంటూ కామెంట్స్ చేసింది. అతను ఎలాంటి బాంబు బ్లాస్ట్ చేయలేదని.. దేశ ద్రోహి కాదంటూ మాట్లాడింది. మమతా కామెంట్స్ కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
దీంతో హీరోయిన్ మమతా కులకర్ణి తన వ్యాఖ్యలపై స్పందించింది. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడింది.. దావూద్ ఇబ్రహీం గురించి కాదు.. విక్కీ గోస్వామి గురించి అని తెలిపింది. దావూద్ నిజంగా ఉగ్రవాదినే అని వెల్లడించింది. కాగా.. గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో అరెస్టైన గోస్వామికి.. ఈమెతో రిలేషన్ ఉంది.
దావూద్‌ను నేనెప్పుడు కలవలేదు..
అంతేకాకుండా తాను దావూద్‌ను ఎప్పుడూ కలవలేదని.. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. నాకు ఇప్పుడు రాజకీయాలతో కానీ.. సినిమా పరిశ్రమతో కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మికతపై అంకితభావంతో ఉన్నానని పేర్కొంది. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కాగా.. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్కు పారిపోయాడు. రెండు దశాబ్దాలకు పైగా కరాచీలో నివసిస్తున్నట్లు సమాచారం.
మమతా కులకర్ణి సినీ జీవితం
1990ల ప్రారంభంలో మమతా కులకర్ణి బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా రాణించింది. క్రాంతివీర్, కరణ్ అర్జున్, చైనా గేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2002లో నటనకు పూర్తిగా స్వస్తి పలికింది. 2016లో, థానే పోలీసులు ఆమెను 2 వేల కోట్ల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2024లో ఆమెపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మమతా సన్యాసిగా జీవనం సాగిస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
