
హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. కమెడియన్ అలీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్ ప్రవీణ్, జైల్ సూపరిండెంట్ దామర్ల కాళిదాసు, హీరోయిన్‌లు ఎస్తర్, దివిలతో పాటు ఇన్‌ఫ్లూయన్సర్ బెజవాడ బేబక్క (మధు), ఎక్స్ యంఎల్‌ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆనందలహరి వెబ్ సిరీస్ ఫేం హీరో అభిషేక్ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– 'ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా లాగు చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం. అందుకే ఎంతో కష్టపడి ఆరు భాషలు మాట్లాడటం నేర్చుకున్నా' అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. 'మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేసినందుకు లోహిత్‌ను ఎంతగానో అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి పునాది అవుతుందని అభిప్రాయపడ్డారు.
నటుడు శివాజీ మాట్లాడుతూ.. 'నేను డిగ్రీ వరకు చదువుకున్నా. చదువు అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనుకున్నా. అందుకే నా పిల్లలకు ఒక్కటే చెప్పాను. నేను సంపాదించి మీకేం ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పా. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టిన సిస్ట్లా స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా లోహిత్‌కి అభినందనలు' అన్నారు.