
కమెడియన్ అలీ సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా సరదాగా ఉంటాడు. మూవీ ఈవెంట్స్‌లో అందరిపై పంచులు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. కానీ నిన్న జరిగిన ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో 15 ఏళ్ల క్రితం తన ఫ్యామిలీలో జరిగిన ఓ విషాదకర విషయాన్ని చెప్పి అందరిని ఎమోషనల్‌కు గురి చేశాడు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడానికి తాను ఎందుకు ఒప్పుకున్నాడో వివరించాడు.
ఈ సినిమా దర్శకుడు రామ్ నా దగ్గరకు వచ్చి ‘సుహాస్‌కి మేనమామ క్యారెక్టర్ చేయాలి’ అన్నారు. వెంటనే నేను ఓకే చెప్పాను. ఎంత ఇస్తారని(రెమ్యునరేషన్) అడగలేదు..ఎన్ని రోజులు కావాలని అడిగాను. వెంటనే ఎందుకు ఒప్పుకున్నానంటే.. సుహాస్‌కి మామయ్య క్యారెక్టర్ చేయాలి అన్నారు. ఎంత ఇస్తారు అని అడగలేదు. ఎన్నిరోజులు కావాలని అడిగా. ఎందుకు చేస్తాననిచెప్పానంటే... 15 ఏళ్ల క్రితం నా మేనల్లుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మా అక్క చనిపోతే.. అతన్ని మా అమ్మే పెంచింది. నా ముందే ఎదిగాడు. ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె మాత్రం నో చెప్పింది.
ఆ మనస్థాపంతో నా మేనల్లుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అప్పటి నుంచి రెండేళ్ల పాటు ఆ అమ్మ ప్రతి రోజు ఏడ్చింది. మనవడు అయినా..కొడుకులా పెంచింది. ఈ సినిమా స్టోరీ చెప్పగానే నాకు మేనల్లుడు గుర్తొచ్చాడు. సుహాన్‌లో చనిపోయిన నా మేనల్లుడుని చూసుకున్నాను. అందుకే ఈ పాత్రకి నేను బాగా కనెక్ట్ అయ్యాను’ అని అలీ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తనదైన శైలీలో పంచులేసి..అందర్నీ నవ్వించాడు.