
ఇప్పటితరం యాక్టర్స్ మధ్య బాండింగ్ ఉందో లేదో తెలీదు గానీ పాత తరం హీరోహీరోయిన్లు మాత్రం తమ మధ్య బంధాన్ని పదిలంగా మెంటైన్ చేస్తుంటారు. చిరంజీవి జనరేషన్ హీరోహీరోయిన్లు.. ప్రతి ఏడాది కచ్చితంగా కలుస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తుంటారు. ఇలానే సీనియర్ నటులు కూడా అప్పుడప్పుడు రీ యూనియన్ ప్లాన్ చేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది.
(ఇదీ చదవండి: రామ్ చరణ్‌కి అమ్మగా ఛాన్స్.. రిజెక్ట్ చేసేశా: ప్రముఖ నటి)
నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి అలీ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, శివాజీ, కృష్ణవంశీ, కె.రాఘవేంద్రరావు, రాజా రవీంద్ర, బీవీఎస్ రవి హాజరయ్యారు. ఈ ఫొటోలని బ్రహ్మాజీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్స్ చూస్తుంటే ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తున్నారు.
ఈ ఫొటోలని పోస్ట్ చేసిన బ్రహ్మాజీ.. '30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్యూ బండ్ల గణేశ్. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో సీనియర్ సిటిజన్స్.. కాదు కాదు సీనియర్ యాక్టర్స్' అని ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫొటోల్లోని చాలామంది అప్పట్లో ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అవుతున్నా సరే అలానే కనిపిస్తుంటడం విశేషం.
(ఇదీ చదవండి: ఓటీటీలో 'సూపర్ మ్యాన్'.. తెలుగులోనూ స్ట్రీమింగ్)