ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
గుంటూరు వెస్ట్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన సీపీఎస్ విధానం ఆమోదయోగ్యంగా లేదన్నారు. దీని రద్దుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పాలకులు నేడు చర్యలు తీసుకోవడం లేదున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీఎస్ గురించి కూడా ప్రస్తావించడం లేదని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఫలితం లేదని వాపోయారు.
అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
చాంద్ బాషా


