
పట్టపగలే సూర్యాపేట జిల్లాలో మహిళ దారుణ హత్య
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : పట్టపగలు ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీకొట్టి.. కత్తులతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మ కూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్ల య్య–భిక్షమమ్మ(40) దంపతులకు ఇద్దరు కుమారు లు. మల్లయ్య లారీ డ్రైవర్‌గా, పెద్ద కుమారుడు భరత్ హైదరాబాద్‌లో మెకానిక్‌గా, చిన్నకుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో ఓ చికెన్ షాపులో పనిచేస్తున్నాడు.
మల్లయ్య–భిక్షమమ్మ దంపతులకు ఇటీవల తగాదాలు జరగ్గా.. మంగళవారం పెద్దల సమక్షంలో మా ట్లాడి భిక్షమమ్మ ఇంటికి తిరిగి వస్తోంది. గ్రామ నడిబొడ్డుకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు భిక్షమమ్మను వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమె వద్దకు దుండగులు కారు దిగి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కత్తులతో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో..
మృతురాలు భిక్షమమ్మకు ఆమె భర్త మల్లయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భిక్షమమ్మకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు పలుమార్లు మందలించారు. ఈ విషయమై పెద్దలు సైతం పంచాయితీలు చేసి సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇటీవల సూర్యాపేటకు చెందిన ఓ దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. ఇదే విషయమై మల్లయ్య పెద్దల సమక్షంలో భార్యను మందలించేందుకు స్థానికంగా ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించగా..
కొద్దిసేపటికే ఆ పార్టీ కార్యాలయ సమీపంలోనే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. మృతురాలి భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులతోపాటు దేశ గురువు, వారి కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే హత్య జరిగిన సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.