పట్టపగలు వివాహిత దారుణ హత్య | peddapalli woman incident | Sakshi
Sakshi News home page

పట్టపగలు వివాహిత దారుణ హత్య

Sep 15 2025 11:03 AM | Updated on Sep 15 2025 11:03 AM

peddapalli woman incident

కుటుంబ కలహాలే కారణం 

భార్యను చంపిన భర్త 

 రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ప్లాట్స్‌లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ప్లాట్స్‌కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్‌ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. 

అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్‌ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య  వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్‌ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్‌ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. 

పంచాయితీయే ప్రాణం తీసిందా? 
ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్‌ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్‌పల్లి ప్లాట్స్‌కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement