
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గవర్నర్‌పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్‌లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది.
