
ఇటీవల బ్రెయిన్‌కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.
లండన్‌లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్‌లో క్రౌబేర్‌కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్‌తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు.
ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్‌స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు.
అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్‌ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు.
అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్‌ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు.
Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA
— The Associated Press (@AP) October 23, 2025
(చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..)